27.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

నిరుద్యోగుల‌కు అమెజాన్ శుభ‌వార్త‌… ప్రాంతీయ భాష వ‌స్తేచాలట‌!

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఇండియా నిరుద్యోగుల‌కు శుభవార్త చెప్పింది. సంస్థ‌లోతాత్కాలిక ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 20 వేల ఉద్యోగాలు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. హైద‌రాబాద్ స‌హా ప‌ది న‌గ‌రాల్లో ఈ ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొంది. త‌ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందుతాయ‌ని పేర్కొంది. క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ విభాగంలో భ‌ర్తీ చేయ‌నున్న‌ ఈ ఉద్యోగాల్లో చాలా వ‌ర‌కూ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కే ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీనికి ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా 12వ త‌ర‌గ‌తి పాస్ కావాల‌ని అమెజాన్ ఇండియా డైరెక్ట‌ర్‌(క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌) అక్ష‌య్ ప్ర‌భు తెలిపారు.

అభ్య‌ర్థులకు ప్రాంతీయ భాష‌లో ప్రావీణ్యం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్నారు. అభ్య‌ర్థుల ప‌నితీరు, కంపెనీ అవ‌స‌రాల‌ ఆధారంగా తాత్కాలిక ఉద్యోగాల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న మార్చుతామ‌ని వివ‌రించారు. రానున్న ఆరు నెల‌ల్లో క‌స్ట‌మ‌ర్ల ఆన్‌లైన్ షాపింగ్ వినియోగం మ‌రింత పెరుగుతుంద‌ని ఆయ‌న‌ అంచ‌నా వేశారు. కాగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో జ‌నాలు నేరుగా బ‌య‌ట అడుగు పెట్ట‌డానికే బ‌య‌ట‌ప‌డుతున్నారు. దీంతో ప్ర‌తిదానికి ఆన్‌లైన్ బాట ప‌ట్టారు. కోవిడ్‌-19 సంక్షోభం, లాక్‌డౌన్‌ ఆంక్షల్లో చిక్కుకుని స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజాల వరకు ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

అయితే ఆన్‌లైన్ రీటైలర్‌ అమెజాన్‌ దీనికి భిన్నంగా వెళుతోంది. తమకు 50 వేల సిబ్బంది అవ‌స‌రం ఉంద‌ని అమెజాన్ ఇండియా ఇంత‌కుముందే ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50 వేల మందిని నియమించుకోనున్నట్లు ప్ర‌క‌టించింది. అమెజాన్‌ ఫ్లెక్స్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ ఉద్యోగాల కింది వీరిని తీసుకుంటామని వివ‌రించింది. భారతదేశం అంతటా అమెజాన్‌ కేంద్రాలు, డెలివరీ నెట్‌వర్క్‌ల‌లో నిరుద్యోగుల‌కు ఉద్యోగ‌ అవకాశాలుంటాయని సంస్థ ప్రకటించింది. క‌రోనా మహమ్మారి వ్యాపిస్తున్న‌ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్ ప్ర‌తినిధి అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles