25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

శ‌రీరంలోని వీటిని త‌ర‌చూ తాకుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌ !

మారుతున్న కాలంతో పాటు మ‌నం అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవలసి వ‌స్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో వివిధ శరీర భాగాలను త‌ర‌చూ చేతులతో తాకవ‌ద్ద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ అవ‌య‌వాల‌ను త‌ర‌చూ చేతితో తాకుతుండ‌టం వ‌ల‌న కరోనా వైరస్ సంక్ర‌మించే అవ‌కాశం చాలా రెట్లు తగ్గుతుంది. ఈ సంగ‌తిని అలావుంచితే ఎవ‌రైనాస‌రే తమ శరీరంలోని కొన్ని అవ‌య‌వాల‌ను త‌ర‌చూ తాకకూడ‌ద‌నే విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అల‌వాట్ల కార‌ణంగా కొన్ని తీవ్రమైన వ్యాధులకు గుర‌య్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

పెదవులు
పెదవులను పదేపదే తాకే అలవాటు మహిళలకు ఎక్కువగా ఉంటుంది. వారు అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం కార‌ణంగా ముఖంలోని ఈ భాగాన్ని చాలాసార్లు తాకుతుంటారు. కొంతమంది పురుషులకు కూడా ఇలాంటి అలవాటుకు ఉంటుంది. ఇది పెదాల ఆకారాన్ని పాడుచేయడమే కాకుండా పెదవుల మృదువైన చర్మానికి హాని కలిగిస్తుంది. అందువల్ల పెదాలను త‌ర‌చూ తాకకుండా ఉండ‌టం ఉత్త‌మం.

కళ్లు
కళ్ళు మన శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం. దీని ద్వారా మన చుట్టూ ఉన్న ప్ర‌పంచాన్ని గ‌మ‌నిస్తుంటాం. కొంతమంది తమ కళ్ళను తరచుగా తాకే చెడు అలవాటు కలిగి ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు, వారి చేతుల్లో ఏదైనా సూక్ష్మక్రిమి ఉంటే, అది కళ్ళకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగించేందుకు దారితీస్తుంది. అందుకే కళ్ళను త‌ర‌చూ తాకే అల‌వాటుకు దూరంగా ఉండండి.

ముక్కు
శ్వాస ప్రక్రియను నిర్వహించడానికి ముక్కు ఉప‌క‌రిస్తుంది. కొంతమందికి ముక్కులో వేలు పెట్టుకునే దుర‌ల‌వాటు ఉంటుంది. ఇది ముక్కు ద్వారా వ్యాధుల‌ను వ్యాపింప‌జేసేందుకు అవ‌కాశ‌మిస్తుంది. మ‌రోవైపు ఈ దుర‌ల‌వాటు వ‌ల‌న శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా త‌లెత్త‌వ‌చ్చు. ఈ అలవాటు పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా ఏ వ‌య‌సువారైనా ఇటువంటి దుర‌ల‌వాటుకు దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి.

చెవి
చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బ‌డ్స్‌కు‌ బదులుగా కొంత‌మంది చేతి వేళ్లను ఉపయోగించ‌డం చూస్తుంటాం. ఇది చాలా ప్రమాదకరమని రుజువ‌య్యింది. చేతి వేళ్ళలో దాగివుండే సూక్ష్మక్రిములు మ‌న కంటికి కనిపించవు. ఈ జెర్మ్స్ చెవి ఇన్ఫెక్షన్ కూడా కలిగిస్తాయి. చెవి ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు గొంతులో వాపున‌కు కారణమవుతుంది. ఇది ప‌లు వ్యాధులు త‌లెత్త‌డానికి దారితీస్తుంది. అందుకే శుభ్రపరచకుండా ఉండే చేతులతో చెవులను ఎట్టిప‌రిస్థితుల్లోనూ తాకవద్దు.

నోరు
ఆహారం తిన్న తరువాత, నోటిలో చిక్కుకున్న ఆహార‌పు ముక్క‌ల‌ను శుభ్రం చేయడానికి చాల‌మంది త‌మ వేలిని ఉప‌యోగిస్తుంటారు. ఈ అలవాటు అనేక రకాల వ్యాధులను నేరుగా శరీరంలోనికి తీసుకువెళుతుంది. అందుకే ఇటువంటి అలవాటు ఉన్నవారు ఇప్ప‌టినుంచే ఈ అల‌వాటును వదిలేయడానికి ప్రయత్నించాలి. చేతుల్లో ఉన్న డర్టీ బ్యాక్టీరియా జీర్ణవ్య‌వ‌స్థ‌ను దెబ్బతీస్తుంది. నోరు శుభ్రం చేయడానికి వెచ్చని నీరు లేదా మౌత్ వాష్ వాడ‌టం త‌ప్ప‌నిస‌రి.

నాభి
నాభిని త‌ర‌చూ తాక‌డ‌మ‌నే అలవాటు గురించి విన్న‌ప్పుడు వింతగా అనిపిస్తుంది. కానీ కొంతమంది త‌ర‌చూ నాభిలో వేలుపెట్టి గోక్కుంటుంటారు. ఇలా చేయడం ద్వారా కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల‌న‌ కొన్నిసార్లు నాభిలో ఇన్ఫెక్షన్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఇది వైద్య చికిత్స తీసుకోవాల్సిన ప‌రిస్థితికి దారితీస్తుంది. అందుకే ఇలాంటి అల‌వాటు ఎవ‌రికి ఉన్నా వారు త‌క్ష‌ణ‌మే మానుకోవాలి. అలాగే ఈ దుర‌ల‌వాట్ల గురించి తెలుసుకున్న‌ప్పుడు ఎదుటివారికి వాటి వ‌ల‌న క‌లిగే హాని గురించి తెలియ‌జెప్పి అవ‌గాహ‌న క‌ల్పించాలి. త‌ద్వారా వారిని అనారోగ్యం బారిన ప‌డ‌కుండా కాపాడిన‌వార‌మ‌వుతాం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles