37.2 C
Amaravathi
Wednesday, June 23, 2021
spot_img

దంతాల నుంచి ర‌క్త‌మా.. వెంట‌నే ఇలా చేయండి !

ఆయుర్వేదంలో అనేక మూలికలు ఉన్నాయి. ఇవి మ‌న‌కు త‌లెత్తే తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు కొన్ని వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ప‌నిచేస్తాయ‌ని గుర్తించారు. నోటి ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స కోసం ఉప‌యోగ‌ప‌డే ఆయుర్వేద ఔషధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిగుళ్ళలో రక్తస్రావం సమస్యతో బాధ‌ప‌డుతున్న కొంత‌మంది క‌రోనా భ‌యాల కార‌ణంగా వైద్యుడి వద్దకు వెళ్ళడానికి కూడా జంకుతున్నారు. చిగుళ్ళ నుండి రక్తస్రావం కారుతున్న‌ సమస్య చాలాకాలం కొనసాగితే ఇది గొంతులో ఇన్ఫెక్షన్ లేదా వాపున‌కు కారణమవుతుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆయుర్వేద ఔషధాన్ని ఉపయోగించడం ద్వారా, చిగుళ్ళ నుండి రక్తస్రావం కారే సమస్యను పరిష్కరించుకోవ‌చ్చు.

అశ్వగంధతో ప‌రిష్కారం
అశ్వగంధతో అనేక ఆరోగ్య‌ ప్రయోజనాలు ఒన‌గూరుతాయి. ఇది పురుషుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వారి మగతనాన్ని బలోపేతం చేయడానికి కూడా చాలా ప్రభావవంతంగా ప‌నిచేస్తుంద‌ని రుజువ‌య్యింది. ఇంతేకాకుండా నోటి ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల సమస్యలను ప‌రిష్క‌రించ‌డంతోపాటు దంతాలు మిల‌మిలా మెరిసేలా చేయడానికి కూడా ఉప‌క‌రిస్తుంది. చిగుళ్ళతో సంబంధం ఉన్న వివిధ రకాల వ్యాధులను నయంచేయడానికి దోహ‌ద‌ప‌డేలా అశ్వగంధంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలిపింది. క్లినికల్ ట్రయల్ సమయంలో పియోరియా చికిత్సలో దాని ప్రభావం కూడా ఉంటుంద‌ని నిర్ధారిత‌మ‌య్యింది. అశ్వగంధ వాడకం వల్ల చిగుళ్ళ నుండి వచ్చే రక్తం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

కావ‌ల‌సిన‌వి: ఒక‌ టీస్పూన్ అశ్వగంధ పొడి. 1/2 టీస్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా

త‌యారుచేసే విధానం: దీన్ని టూత్‌పేస్ట్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది. మొదట ఉప్పు, బేకింగ్ సోడా మరియు అశ్వగంధ పొడిలను కొద్దిగా నీటితో కలపడం ద్వారా పేస్ట్ తయారు చేసుకోండి. పేస్ట్ మ‌రీప‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోండి. దానిని దంతాలు, చిగుళ్ళపై రాయండి.
ప్రతి రోజూ ఉదయాన్నే లేచిన‌పుడు, అలాగే సాయంత్రం ఆహారం తిన్న తరువాత ఈ ఆయుర్వేద పేస్ట్‌తో పళ్ళు, చిగుళ్ళను పూర్తిగా శుభ్రం చేసుకోండి. ఈ పేస్ట్‌ను ఒక‌ వారం క్రమంతప్పకుండా ఉపయోగించడం వల్ల దాని ప్రయోజనాల ప్రభావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. దీనితోపాటు ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోండి. ఈ ఉపాయం వారం రోజుల పాటు పాటించినా ఎటువంటి ప్రయోజనం కనిపించకపోతే, వెంటనే ఆలస్యం చేయకుండా దంతవైద్యుడిని సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles