37.2 C
Amaravathi
Wednesday, June 23, 2021
spot_img

కురుల న‌ల్ల‌ద‌నానికి, చుండ్రు పోగొట్ట‌డానికి చ‌క్క‌ని ప‌రిష్కార‌మిదే !

మిరియాలు ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని భావిస్తారు. దగ్గు, జలుబు నివార‌ణ‌కు, జీర్ణక్రియ స‌క్ర‌మంగా సాగేందుకు మిరియాలు ఉప‌యుక్త‌మ‌వుతాయి. ఇంతేకాదు అధిక రక్తపోటు రోగులకు మిరియాలు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే మిరియాలు మ‌న‌ జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయ‌ని మీకు తెలుసా? తలలో చుండ్రు అధికంగా ఉన్నా‌ మరియు మీ జుట్టు చాలా వేగంగా ఊడిపోతున్నా అటువంటి సంద‌ర్భాల్లో మిరియాలు ఈ సమస్య నుండి ఉపశమనం క‌లిగిస్తాయి. ఇందుకోసం మిరియాల‌ను ఎలా ఉప‌యోగించాలో తెలుసుకుందాం.

తెల్ల జుట్టుకు…
మీరు తెల్ల జుట్టుతో బాధపడుతూవుంటే మీ జుట్టుకు నల్ల మిరియాలు,పెరుగుతో త‌యారుచేసిన‌ హెయిర్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డ‌టాన్ని మిరియాలు నిరోధిస్తాయి. ఎందుకంటే వీటిలో రాగి పుష్కలంగా ఉంటుంది. పెరుగు మీ జుట్టుకు తేమను అందిస్తుంది. మరియు విటమిన్ సి లోపాన్ని నివారిస్తుంది.

హెయిర్ ప్యాక్ ఎలా చేయాలి?
ఈ హెయిర్ ప్యాక్ త‌యారుచేయడానికి ఒక గిన్నెలో ఒక‌ కప్పు పెరుగు తీసుకోవాలి. తరువాత దానిలో ఒక‌టిరెండు టేబుల్ స్పూన్ల మిరియాలు పొడి వేసుకుని బాగా క‌ల‌పాలి. తరువాత దానిలో ఒక చెమ్చా తేనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ హెయిర్ ప్యాక్‌ను మీ జుట్టుకు పూర్తిగా రాయండి. అర‌గంట త‌రువాత మీ జుట్టును శుభ్రంగా క‌డిగేసుకోవాలి.

చుండ్రు నివార‌ణ‌కు
వాతావరణం మారిన కార‌ణంగా జుట్టులో చుండ్రు సమస్య త‌లెత్తుతుంది. ఇటువంటి సందర్భంలో మిరియాలపొడిలో ఆలివ్ నూనె క‌లిపి త‌ల‌మీద‌ మసాజ్ చేయవచ్చు. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేయ‌డం ద్వారా చుండ్రు స‌మ‌స్య‌ను త్వర‌గా వదిలించుకోవచ్చు.

హెయిర్ ప్యాక్ త‌యారీ
జుట్టులో పేరుకున్న చుండ్రు తొలగించడానికి ఒక గిన్నెలో ఒక చెమ్చా మిరియాల పొడి తీసుకోండి. దానిలో ఆలివ్ ఆయిల్ వేసి, ఈ రెండింటినీ బాగా కలపాలి. తరువాత దానిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని మీ త‌ల‌మీద బాగా రాసుకుని, రాత్రంతా అలానే ఉంచుకోవాలి. మ‌ర్నాడు జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి. ఇది చుండ్రును తొల‌గించేందుకు సహాయపడుతుంది.

ద‌ట్ట‌మైన కురుల కోసం జుట్టు కోసం
పొడవాటి, ద‌ట్ట‌మైన కురుల కోసం మిరియాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మిరియాలు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడంలో సహాయపడ‌తాయి. ఇందుకోసం కొంత ఆయిల్ తీసుకొని, దానిలో మిరియాలు పొడి కలపండి. ఇప్పుడు రెండు వారాల పాటు గాలి చొరబడని కంటైనర్‌లో దానిని ఉంచండి. అనంత‌రం దానిని జుట్టు మీద అప్ల‌య్‌ చేసి, 30 నిమిషాలు అలానే ఉంచి, త‌రువాత క‌డుక్కోండి. ఇది కురుల పెరుగుద‌ల‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles