Home ఆరోగ్యం రోజూ హెయిర్‌జ‌ల్ వాడితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రోజూ హెయిర్‌జ‌ల్ వాడితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

0

హెయిర్ స్ట‌యిలింగ్‌ అనేది అలంక‌ర‌ణ‌లో ఒక భాగం. చక్కటి జుట్టు క‌లిగిన‌వారు మ‌రింత అందంగా క‌నిపిస్తారు. ఈ కారణంగానే ఇప్పుడు అంద‌రూ కేశాలంకరణపై శ్రద్ధ చూపిస్తున్నారు. హెయిర్ జెల్ అనేది జుట్టుకు స్ట‌యిలిష్‌ లుక్ ఇవ్వడానికి ఎన్నో ఏళ్లుగా ట్రెండ్‌లో ఉంది. ఇది జుట్టును అందంగా ఒకే తీరులో ఎక్కువ‌సేపు ఉంచుతుంది. అయితే జుట్టుకు అప్ల‌య్‌చేసే ఈ హెయిర్ జెల్ ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలుసా? దీనిని రెగ్యులర్‌గా వాడితే జుట్టు తెల్లబ‌డుతుంది. ఎందుకంటే వాటిలో రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి అత్యంత హానికరమని భావిస్తారు. హెయిర్ జెల్ వ‌ల‌న క‌లిగే కొన్ని దుష్ప్రభావాల గురించి తెలుసుకోండి!

జుట్టును డీహైడ్రేట్ చేస్తుంది
చాలా హెయిర్ జెల్‌ల‌లో ఆల్కహాల్ మరియు ఇతర హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టును పొడిబారేలా చేస్తాయి. దీని రెగ్యులర్ వాడకం వల్ల జుట్టు చిట్లిపోతుంది. ఈ జెల్ జుట్టులోని తేమను గ్రహిస్తుంది. ఫ‌లితంగా ఇది జుట్టును ఎండిపోయిన‌ట్లు చేయ‌డ‌మే కాకుండా, నిర్జీవంగా మార్చివేస్తుంది. ఇంతే కాదు త‌ల‌లో దురదను కూడా కలిగిస్తుంది.

జుట్టు రాలడం
హెయిర్ జెల్‌ని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు నెమ్మదిగా ఊడిపోతుంద‌ని మీకు తెలుసా? హెయిర్ జెల్‌లో కనిపించే రసాయనం సెబమ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది నెత్తిమీద తేమను నిలిపివుంచి, జుట్టును బలంగా ఉంచడానికి దోహ‌ద‌ప‌డుతుంది. సెబమ్ ఉత్పత్తి లేకపోవడం వల్ల, తల వెంట్రుకలు సులభంగా ఊడిపోవ‌డం జ‌రుగుతుంది.

బ‌ట్ట‌త‌ల‌
హెయిర్ జెల్ వాడటం వల్ల దానిలోని రసాయనాల కార‌ణంగా బ‌ట్ట‌త‌ల వ‌చ్చే అవ‌కాశాలుంటాయి. పూర్తిగా బ‌ట్ట‌త‌ల రూపానికి రాక‌పోయినా, ఆ ర‌సాయ‌నాలు చెడు ప్రభావాన్ని చూపుతాయి. త‌ల‌పై చ‌ర్మం పొడిబార‌డం కార‌ణంగా అది చుండ్రు ఏర్ప‌డేందుకు దారితీస్తుంది. ఈ జెల్ కార‌ణంగా తలపై మంట‌పుట్ట‌డం లాంటి స‌మ‌స్య‌లు ఎదురవుతాయి.

జుట్టు తెల్లబడటం
హెయిర్ జెల్ మ‌న జుట్టును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల జుట్టు బలహీనంగా, సన్నగా మారుతుంది. అలాగే, ఎక్కువ జెల్ రాయ‌డం వ‌ల‌న జుట్టు రంగు తెల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టుకు రంగు వేసుకున్న త‌రువాత‌ జెల్ రాసుకోకూడ‌దు.

రెండుగా చిట్లిపోయే సమస్య
హెయిర్ జెల్ వినియోగం కార‌ణంగా జుట్టు పొడిబారడం మాత్ర‌మే కాకుండా వెంట్రుక‌లు రెండుగా చిట్లిపోతాయి. ఫ‌లితంగా జుట్టు బలహీనపడుతుంది.

Exit mobile version