Home ఆరోగ్యం ఆన‌ప‌కాయ‌ను ఇలా తిని, అలా బ‌రువు త‌గ్గండి !

ఆన‌ప‌కాయ‌ను ఇలా తిని, అలా బ‌రువు త‌గ్గండి !

0

ఆన‌ప‌కాయ‌ను ప్రతి ఇంట్లోనూ కూర‌లు త‌యారుచేసేట‌ప్పుడు వినియోగిస్తుంటారు. మ‌న‌కు ఎదుర‌య్యే కాలానుగుణ వ్యాధులను ఆన‌ప‌కాయ నివారిస్తుంది. దీనిని‌ జీర్ణించుకోవడం చాలా సులభం. అలాగే శ‌రీర‌ బరువు తగ్గడానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌వారు త‌మ‌ డైట్‌లో ఆన‌ప‌కాయ‌ను భాగం చేసుకోవాలి. ఆన‌ప‌కాయ‌లో త‌క్కువ మోతాదులో కేలరీలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి అనువైన కూరగాయగా కనిపిస్తుంది. ఆన‌ప‌కాయ‌ను ఉడికించి కూర‌గా తినేక‌న్నా సలాడ్ మాదిరిగా తినడం ఉత్త‌మం. ఊబకాయం తగ్గ‌డానికి ఆన‌ప‌కాయ‌ను ఏ రీతిలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం!

ఆన‌ప‌కాయ‌తో బరువు తగ్గడం ఎలా
ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ది ట్రాపికల్ మెడిసిన్‌ సెప్టెంబర్ 2012లో ప్రచురించిన ఒక ఆర్టిక‌ల్‌లో ఆన‌ప‌కాయ అనేది‌ జంతువులపై ఎటువంటి ప్ర‌భావాన్ని చూపుతుంద‌నే దానిపై నిర్వ‌హించిన‌ ఒక అధ్యయన వివ‌రాలు వెల్ల‌డించారు. ఆన‌ప‌కాయ‌ను ఎలుక‌ల‌కు ఆహారంగా ఇచ్చి, ఫ‌లితాలు గ‌మ‌నించ‌గా, వాటి బరువు అదుపులో ఉంటున్న‌ద‌ని కనుగొన్నారు. అయితే ఇంతవరకు మానవులపై ఇలాంటి పరిశోధనలు జరగలేదు.

స‌లాడ్ రూపంలో…
ఆన‌ప‌కాయ‌లో చాలా తక్కువ శాతంలో కొవ్వు, కొలెస్ట్రాల్ కనిపిస్తాయి. ఇది బరువు తగ్గడానికి అవసరమైన నీరు మరియు పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మరియు పొటాషియం త‌దిత‌ర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడానికి జ్యూస్‌ బదులుగా పండ్లు లేదా కూరగాయలను ఆలాగే తినాలని నిపుణులు సూచిస్తుంటారు. ఈ సూత్రం ఆన‌ప‌కాయ‌కు కూడా వ‌ర్తిస్తుంది. దీనిని స‌లాడ్ రూపంలో తిన‌డం ఉత్త‌మం.

జ్యూస్‌లో ఫైబర్ ఉండదు
ఆన‌ప‌కాయ జ్యూస్‌లో ఫైబర్ ఉండ‌దు. నేరుగా ఆన‌ప‌కాయ ముక్క‌లు తినేకంటే జ్యూస్‌తాగితే ఎక్కువ కేలరీలు జ‌త‌చేరుతాయి. ఒక కప్పు ఉడికించిన ఆన‌ప‌కాయ‌లో 19 కేలరీలు, 2 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటుంది. అదే ఒక కప్పు ఆన‌ప‌కాయ జ్యూస్‌ తయారు చేయడానికి ఎక్కువ ఆన‌ప‌కాయ‌ముక్క‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఫ‌లితంగా జ్యూస్‌లో కేలరీల పరిమాణం పెరుగుతుంది.

మంచి నిద్ర‌కు…
మంచి నిద్ర అనేది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్న‌వారు ఆన‌ప‌కాయ స‌లాడ్ తీసుకోవ‌డం ఉత్త‌మం. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. మంచి నిద్ర జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు మీ హార్మోన్లను చురుకుగా ప‌నిచేసేలా చేస్తుంది.

Exit mobile version