దుమ్ముదులుపుతున్న బాలయ్య అభిమానులు.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకి సిద్దమయ్యింది. ఆయనకి ఇది 100వ చిత్రం కావడంతో ఆయన అభిమానులు వినూత్న పద్దతుల్లో ఈ వేడుకని జరుపుకోడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలు ధియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది.

గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన బాలయ్య వీరాభిమాని రావెల జ్ఞానకోటేశ్వరరావు సినిమా విడుదల రోజున 100 కేకులు కటింగ్ ఏర్పాటు చేసారట. దీని కోసం 100 మంది విశిష్ట అతిధులని ఆహ్వానించారట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా చర్చనీయాంశం అయ్యింది. బాలకృష్ణ అభిమానులకి 12వ తేదీనే పండుగ మొదలవ్వ నుంది.

ఒక్క నరసరావుపేట లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య అభిమానులు ఆయా థియేటర్లలో పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్స్ లతో సందడి చేస్తున్నారు. బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100వ చిత్రం అభిమానుల దాహం తీరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

You might also like