బాలయ్య స్టామినా తెలియాలంటే…ఈ ఒక్క సంఘటన చాలు !!

నటసింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి. భారతదేశాన్ని ఏక చత్రాదిపత్యంగా పరిపాలించిన శాతకర్ణుడి చరిత్రని తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. ప్రపంచవ్యాప్తంగా 12న విడుదలకి సిద్దంగా ఉంది ఈ చిత్రం.

‘గౌతమీపుత్ర’ శాతకర్ణి సినిమా షూటింగ్ చాలా వరకు ఒరిజినల్ లోకేషన్లలోనే తెరకెక్కించారు. శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయల్దేరే సన్నివేశాన్ని మొరాకోలో చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో బాలయ్య సాహసం చేశారు.

బాలయ్య ఓ పసిబిడ్డను ఎత్తుకుని గుర్రంపై వెళ్తుండగా చుట్టూ అగ్నిగోళాలు మండుతూ ఉంటాయట. అయితే గుర్రం కొంచెం ముందుకెళ్లాక ఓవైపున్న అగ్నిగోళాలు పేలడంతో.. గుర్రం హఠాత్తుగా పక్కకి తిరిగిపోయిందట. బాలయ్య గుర్రం పై నుంచి కిందకి పడిపోయారట. వెంటనే బాలయ్య తేరుకుని తన గురించి కూడా ఆలోచించకుండా పసిబిడ్డకి ఎలాంటి హాని జరగకూడదని కవచంలా మరిపోయారట. బిడ్డకి ఎలాంటి హాని జరగలేదని తెలిశాక బాలయ్య కాస్త కుదుటపడి అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళి షూటింగ్ లో పాల్గొన్నారట.

ఇది చూసిన అక్కడి మొరాకో ఆర్టిస్టులు ఆశ్చర్యపోయి బాలయ్య వైపు అలా చూస్తూ ఉండిపోయారట. బాలయ్య స్టామినా ఏంటో తెలుసుకోటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో శ్రమ తీసుకుని ప్రతిష్టత్మక ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి సినిమా పూర్తి చేశారు.

You might also like