రంగంలోకి దిగిన బాలయ్య.

నటసింహ నందమూరి బాలకృష్ణ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని మరో సారి నిరూపించారు. ఇప్పటికే నటనతో పాటుగా హిందూపురం శాసనసభ్యుని గా నియోజకవర్గం పై చెరగని ముద్ర వేసిన బాలకృష్ణ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు సామాజిక అంశాలపై సత్తా చాటుతున్నారు బాలకృష్ణ.

నెల్లూరు జిల్లాలోని పెన్నా నదీ తీరాన వెలిసిన ప్రాచీన ‘తల్పగిరి రంగనాధ స్వామి దేవస్థానా’నికి ఎంతో చరిత్ర ఉంది. అలాగే ఆ దేవస్థానానికి కొన్ని కోట్లు విలువ చేసే భూములున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు భూముల ఆదాయం వెళ్ళిపోతుంది. పాత కాలంలో 99 సంవత్సరాల లీజు కు తీసుకున్న కొందరు వాటిని సబ్ లీజుకు ఇచ్చి గడువు దాటినా వాటిని ఖాళీ చేయకుండా వాటి పై వచ్చే ఆదాయాన్ని స్వాహ చేస్తున్నారు.

ఇప్పటి దాకా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆపలేని ఈ దోపిడిని బాలయ్య దృష్టికి తీసుకెళ్ళారు ఆలయ చైర్మన్ సుధాకర్ శెట్టి. దీంతో బాలకృష్ణ ఏకంకా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ తో మాట్లాడి ఆలయ విశిష్టత తెలియచేసి దాన్ని కాపాడడం కోసం తాము కూడా నిలబడతామని అన్నారట. దీంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో రంగం లోకి దిగిన నెల్లూరు మునిసిపల్ సిబ్బంది ఆలయ మెంబెర్ లతో కలిసి వారిని కాళీ చేయించారట.

కైంకర్యం అయిపోయానుకున్న దేవాలయ భూములను తిరిగి రప్పించిన బాలయ్యను ఆయన డైలాగ్ లు తోనే పొగిడేస్తున్నారట నెల్లూరు వాసులు.

You might also like