snaxngrox.com Free Shipping

అమరావతి – సీమ మధ్య ‘ఎక్స్‌ప్రెస్‌ వే’.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ నాలుగు జిల్లాలను రాజధానికి కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భూసేకరణ చేసి ఇస్తే మిగతా ప్రాజెక్టును బీవోటీ పద్ధతిలో చేపట్టనున్నారు.

గంటకు 120 కి.మీ. మేర ప్రయాణించేలా ఎక్స్‌ప్రెస్‌ వే ని నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం. ఈ ప్రాజెక్టు అంచనా సుమారు రూ.29,557 కోట్లు. దానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 19వ తేదీన భూసమీకరణ కోసం సీఎం చంద్రబాబు చైర్మన్ గా ఒక కమిటీని నియమించింది కేంద్రం. రెవెన్యూ, ఆర్థిక, అటవీ, రవాణా శాఖమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులతోపాటు అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

నాలుగు, ఆరు వరుసలుగా నిర్మించే ఈ ఎక్స్‌ప్రెస్‌ వే అనంతపురం నుంచి ప్రారంభమై అమరావతి వరకు వస్తుంది. మధ్యలో కడప, కర్నూలు నుంచి వచ్చే రెండు రహదారులు వచ్చి ఎక్స్‌ప్రెస్‌ వే తో కలుస్తాయి. మొత్తం ఈ రహదారులన్నీ కలిసి దాదాపు 621 కి.మీ.పొడవున ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం మొత్తం 8,692.52 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది.

రాబోయే ఆరు నెలల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కు అవసరమయ్యే భూమిని సిద్ధం చేయాలనే లక్ష్యంతో.. త్వరితగతిన నిర్ణయం తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని, ఐదు జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించారు చంద్రబాబు. భూసేకరణ పూర్తవ్వగానే పట్టాలేక్కనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ వే రాజధాని – సీమ మధ్య ప్రయాణ సమయం తగ్గించడానికి ఉపయోగపడబోతోంది.

You might also like