snaxngrox.com Free Shipping

థియేటర్లలో మంటలు …పరుగులు తీసిన ప్రేక్షకులు

కొత్త సినిమాలు రెండు విడుదల అయ్యాయి …ఎంచక్కా చూసేద్దాం అని సినిమా థియేటర్ల కి వెళ్ళిన ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీసారు

తెలంగాణా రాష్ట్రంలో స్టేషన్ ఘన్ పూర్ లో రెండు సినిమా థియేటర్ల లో ఒక్క సారిగా మంటలు వ్యాపించి పొగమయం కావటంతో షాక్ కి గురయ్యిన ప్రేక్షకులు ప్రాణభయం తో పరుగులు తీసారు .

లక్ష్మి , మహాలక్ష్మి అనే జంట థియేటర్లు ఈ ప్రమాదానికి లోనయ్యాయి …ముందుగా లక్ష్మి థియేటర్ లో మొదలయిన మంటలు పక్కనే ఉన్న మహాలక్ష్మి థియేటర్ కి కూడా వ్యాపించినవి

ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తేవటానికి ప్రయత్నిస్తుంది అని తెలుస్తుంది