రికార్డుల వేటలో పడ్డ ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి.

నటసింహం బాలయ్య 100వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి. భారత దేశాన్ని ఏక చత్రాదిపత్యంగా పాలించిన శాతకర్ణి చరిత్రని వెండి తెర దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు దర్శకుడు క్రిష్. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలేజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. అమ్మకాల్లో మూడంకెలు దాటిన రెండో తెలుగు సినిమా ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి.

రిలయన్స్ సంస్థ ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి జాతీయ, అంతర్జాతీయ హక్కులను కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి కొన్నారు అనే దాని పై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 60 కోట్లకు డీల్. కుదిరిందని చెప్తున్నారు.

ఆంధ్ర తెలంగాణా కి సంబంధించి ఒక్క గుంటూరు మినహా భారీ గా అమ్ముడు పోయింది అని అనధికార సమాచారం ఇది దగ్గరగా 100 కోట్లు వరకు ఉండవచ్చు (ఒక 10-20కోట్లు తేడా తో). బాహుబలి తరువాత అంత అమ్మకాల్లో మూడంకెలు దాటిన తెలుగు సినిమా గా సినీ వర్గాలు చెప్తున్నాయి

You might also like