snaxngrox.com Free Shipping

బీసిలకు శుభవార్త

రాష్ట్ర ప్రభుత్వం బిసి వర్గాల వారికి శుభవార్త చెప్పింది …ఇప్పటికే బిసి , ఎస్సి , ఎస్టి , మైనారిటీ వర్గాలకి పలుపధకాలు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుత పధకానికి నాంది పలికింది

రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ పధకాన్ని ప్రకటించారు …చంద్రన్న పెళ్లికానుక పేరుతో రాష్ట్రంలో ఉన్న బిసి లకి లబ్ధి చేకూర్చనున్నారు …ఈ పధకం ద్వారా లబ్ధి పొందాలి అనుకునే వారు తమ పరిధిలోని రెవిన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పెళ్ళి ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు అందిస్తారు

ఈ పధకం నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటవ తారీఖు నుంచి అమలు లోకి వస్తుంది అని మంత్రి తెలిపారు …ఈ సదావకాశాన్ని బిసి వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రి పిలుపునిచ్చారు