snaxngrox.com Free Shipping

దేశం మీసం తిప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి

ఈరోజు విడుదల అయిన నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంచలనాలకు మారు పేరుగా నిలవనుందా? అవును బాలయ్య అభిమానులు దేశం మీసం తిప్పే సమయం రానే వచ్చింది. సమయం లేదు మిత్రమా తెలుగు జాతి కీర్తిని చాటి చెప్పాల్సిందే అంటూ బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణితో వచ్చేశాడు. ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. జై బాలయ్య… జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగుతున్నాయి. అంచ‌నాలు అంతకంతకూ పెరిగిపోయాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే బాల‌య్య తెర‌పై విజృంభించాడా? చ‌రిత్ర ఆధారంగా మనకి కొద్దిగానే తెలిసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవితం ఎలాంటిది? ఇవన్ని తెలుసుకోవాలంటే ఒక సారి సినిమా చూడాల్సిందే

కథేంటంటే: ఒకే రాజ్యం అదే అఖండ భరత జాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాల‌కృష్ణ‌). దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు. ఉత్తరదక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తాడు. రాజసూయ యాగంలో తల్లికి అగ్రతాంబూలం ఇచ్చి తల్లి పేరే తన పేరుగా గౌతమీపుత్ర శాతకర్ణి గా మార్చుకుంటాడు శాతకర్ణి. అయితే అలెగ్జాండర్‌ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కించుకోవాల‌ని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి శాతకర్ణిపై పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్‌ని శాతకర్ణి ఎలా దెబ్బకొట్టాడు? తాను కలలుగన్న అఖండభారతావనిని ఎలా సృష్టించాడు? అన్న‌ది తెలియాలంటే థియేటర్లో మీద సినిమాను చూడాల్సిందే.
ఎలా ఉందంటే: తెలుగు జాతి, తెలుగు వీరుడి గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రమిది. బాలకృష్ణ కోసమే పుట్టిన కథ ఇది. పాటల వేడుకలో సాయి మాధవ్ అన్నట్టు బాలకృష్ణ మాత్రమే చేయగలరేమో అనిపించేలా ఉంటుంది. ప్రధానంగా యుద్ధ ఘట్టాల నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. నహపాణుడిని ఓడించే సన్నివేశాలు సినిమాకి కీలకంగా మారాయి. నహపాణుడు సామంతరాజల వారసుల్ని బంధించి యుద్ధానికి వచ్చేటప్పుడు శాతకర్ణిని తన కొడుకు పులోమావిని తీసుకుని రమ్మని చెప్తాడు. అందుకు తగ్గట్లే శాతకర్ణి యుద్ధానికి కుమారుడితో బయలుదేరేటప్పుడు శాతకర్ణి భార్య వాసిష్ఠి దేవి అడ్డుచెప్పే సన్నివేశాలు ప్రేక్షకులన్ని కంటతడి పెట్టిస్తాయి. రాజసూయ యాగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మాతృమూర్తి గొప్పతనాన్ని చాటిచెబుతూ సాగుతాయి. ఇక పదునైన సంభాషణలు సినిమాకు ప్రధాన బలం. యుద్ధ సన్నివేశాలకు దీటుగా ఒకొక్క మాట ఓ తూటాలా పేలింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనే భావన తెరపై ఎక్కడా కలగదు. ఓ చారిత్రాత్మక కథకి బలమైన మాస్‌ అంశాలను జోడించి చెప్పిన విధానం క్రిష్‌ పనితనానికి అద్దం పడుతుంది.

స‌మ‌ర్ప‌ణ: బిబో శ్రీనివాస్‌
నిర్మాణ సంస్థ: ఫ‌స్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
తారాగ‌ణం: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియ శ‌ర‌న్‌, హేమామాలిని, క‌బీర్ బేడీ, శివ‌రాజ్ కుమార్ త‌దిత‌రులు
మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా
పాట‌లు: సీతారామ‌శాస్త్రి
సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌
చాయాగ్ర‌హ‌ణం: జ్ఞాన‌శేఖ‌ర్‌
క‌ళ: భూపేష్ భూప‌తి
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక వర్గం చాలా కష్టపడ్డారు. నిర్మాణ విలువలు చెప్పుకోదగినవి.

ప్లస్ పాయింట్స్:
+ కథ, కథనం
+ బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని నటన
+ క్రిష్‌ దర్శకత్వం
+ సాయిమాధవ్‌ సంభాషణలు

మైనస్ పాయింట్స్:

-సినిమాలో ఎక్కడా మైనస్ అనుకోడానికి ఎమీ లేదు

చివరగా: తెలుగు వాడు దేశం మీసం తిప్పిన్నట్టే ఈ సినిమాతో.

ట్రెండింగ్ తెలుగు ఇస్తున్న రివ్యు: 4/5

You might also like