గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ సంచలనం.

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి ట్రైలర్ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 100 థియేటర్లలో విడుదలై ప్రేక్షక అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది.

నేటి తరం కథానాయకులతో పోటి పడుతూ ట్రైలర్ విడుదలవ్వడమే ఆలస్యం.. అంతర్జాలంలో హంగామా సృష్టిస్తుంది. విడుదలైన 4 గంటలకే మిలియన్ వ్యూస్, 30 వేల లైకులు సాధించిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే కావటం విశేషం. అంతే కాదు 24 గంటల్లో 24 లక్షల వ్యూస్, 56 వేల లైకులు సాదించింది.

ప్రచార చిత్రం వీక్షించిన మొదలు అభిమానులు తమ నటసింహం సంక్రాంతి సమరంలో మరోసారి సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు చిత్రాలని మరపించే స్థాయిలో ఘన విజయాన్ని సాదించబోతున్నాడని అనందోత్సాహలతో పండుగ చేసుకుంటున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, విమర్శకుల నుంచి శాతకర్ణి గా బాలయ్య నట రాజసానికి, కేవలం 79 రోజుల్లో పరిమిత నిర్మాణ వ్యయంతో అద్బుతంగ చిత్రీకరించిన క్రిష్ దర్శకత్వ ప్రతిభకి, బుర్రా సాయిమాధవ్ పదునైన సంభాషణలకి ట్విట్టర్ వేదికగా విశేషంగా ప్రశంసలు లభిస్తున్నాయి 

ఇంత సంచలనం సృష్టించిన ఆ ట్రైలర్ మనం కూడా ఒక సారి చూద్దామా 

You might also like