snaxngrox.com Free Shipping

వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కోడెల

కోటప్పకొండ ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో స్పీకర్ చొరవతో ఒక ప్రాణం నిలబడింది …

వివరాల్లోకి వెళితే కోటప్పకొండ ఘాట్ రోడ్డులో మూర్ఛ వచ్చి యామలయ్య అనే యువకుడు లోయలో పడిపోయాడు …అదే సమయంలో అటు వెళుతున్న సభాపతి కోడెల కాన్వాయ్ అది గమనించి అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించటమే గాక కోడెల పర్యవేక్షణలో ఆయన వ్యక్తిగత సిబ్బంది సుమారు 150 అడుగుల లోయలో నుంచి సదరు యువకుడిని క్షేమంగా బయటకి తీసుకువచ్చారు

అక్కడి నుంచి కోడెల స్వయానా తన సొంత వాహనం లో ఆ యువకుడిని ప్రధమ చికిత్సకొరకు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కోడెల సమయస్ఫూర్తి కి స్థానికులు ప్రసంశలు కురిపిస్తున్నారు

Video Courtesy : AP 24×7