snaxngrox.com Free Shipping

నగరి గ్రౌండ్ రిపోర్ట్ …

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి అని గ్రౌండ్ రిపోర్ట్ సేకరించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి …

ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా నాయకురాలు రోజా పై తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది …అసలు వివరాల్లోకి వెళితే సహజంగా గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హవా ఎక్కువగా కనిపించేది ఆ నియోజకవర్గంలో …తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఇప్పటికి జరిగిన 8 ఎన్నికలలో ఆ పార్టీ కేవలం ౩ సార్లు మాత్రమే గెలిచింది 4 సార్లు కాంగ్రెస్ గెలవగా గత ఎన్నికలలో మాత్రం వైకాపా గెలిచింది …

అయితే కేవలం స్థానిక అభ్యర్ధి వైఫల్యం అనుకోవచ్చు మరొకటి అనుకోవచ్చు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనున్నది అని తెలుస్తుంది …పోయిన సారి ఎన్నికలలోనే చావు తప్పి కన్ను లొట్టా పోయిన చందాన కేవలం 858 వోట్లతో గెలిచిన రోజా …ఈ సారి మాత్రం గెలిచే అవకాశమే లేదని అందుకే వేరే నియోజకవర్గం వైపు చూస్తున్నారు అని మనకి అందుతున్న సమాచారం.

అసలు రోజా ఎందుకు ఓడిపోతారు దానికి కారణాలు ఏంటి అంటే …మొట్టమొదటి పాయింట్ ఆవిడ వ్యవహారశైలే అని నగరి నియోజకవర్గం కోడై కూస్తోంది …నిన్న మొన్నటి వరకు నియోజకవర్గ స్థాయి లో ఏ నాడు అందుబాటులో లేని ఆవిడ
గత కొద్ది నెలలు గా మాత్రం పాదయాత్ర అని మరొకటి అని నియోజకవర్గ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నాలు మమ్మురం చేశారు …దీనికి కారణం లేకపోలేదు తన ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు
నియోజకవర్గంలో స్పీడు పెంచటం …అయన తనయుడు భానుప్రకాష్ పార్టీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని గడప గడపకి వెళ్లి ప్రజలలో మమేకం అవ్వటం …ప్రజా సమస్యలపై
తగు రీతిలో స్పందిస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తూ ప్రజలలోకి వెళ్తుండటంతో ఈ యువనేతకి నియోజకవర్గ ప్రజల వద్దనుంచి మంచి మార్కులే పడుతున్నాయి అంటున్నారు …ఎటువంటి భేషజాలు లేకుండా ప్రజలలో కలసిపోయి ఓపికగా వారి వారి సమస్యలు వినటం …తన పరిధిలో ఉన్నంత వరకు వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతున్నారు …

 

ప్రజలతో మమేకం అవటమే గాక రాజకీయంగా కూడా పావులు స్పీడుగానే కదుపుతున్నట్లు సమాచారం …ఉన్న అయిదు మండలాల్లో తమకు అనుకూలంగా ఉన్న మండలాల్లో ఇప్పటికే ఉన్న బలాన్ని పెంచుకుంటూ పోవటమే కాకుండా , గత ఎన్నికలలో రోజాకి కలసి వచ్చిన నగరి మండలం మరియు వడమాలపేట మండలంపై గాలి తనయుడు ఇప్పటినుంచే ప్రత్యెక దృష్టి పెట్టి ఆ మండలాల ప్రజలని ఆకర్షించే పనిలో నిమగ్నం అయి ఉన్నారు అని తెలుస్తుంది

మరో పక్క సిట్టింగ్ ఎమెల్యే రోజా ప్రజాసమస్యల పై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం అధికార పార్టీ పై దుమ్మెత్తిపోసే పనిలో ఉన్నారు…కేవలం ఆవిడ మాటలకే పరిమితం అయ్యారు తప్పితే ఈ మూడున్నర ఏళ్ళలో ఎమెల్యే గా ఆమె వల్ల ఒరిగింది ఏమి లేదని సొంత పార్టీ కార్యకర్తలే బాహాటంగా విమర్శిస్తున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు

స్థానిక పరిస్థితులని గాలి తనయుడు తమకి అనుకూలంగా మలుచుకుంటూ ప్రజాక్షేత్రంలో చాప కింద నీరులా సాగిపోతుంటే …రోజా పరిస్థితి మాత్రం రోజురోజుకి దిగజారిపోతుంది అని తెలుస్తుంది…మరి ఇన్ని అనుకూలతల మధ్య ఈ సారి గాలి ముద్దుకృష్ణమనాయుడు తానే పోటీ చేస్తారో ,తనయుడిని పోటీలోకి దించుతారా అనేది తెలియ రావాల్సి ఉంది