snaxngrox.com Free Shipping

క్రిష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ.

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందవ చిత్ర గౌతమీపుత్ర శాతకర్ణి. జనవరి 12న సంక్రాంతి కానుక గా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్దమయ్యింది. బాలయ్య అభిమానులు సినిమా పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చిత్ర దర్శకులు క్రిష్ ఆడియో వేడుకలో ఖబడ్దార్ అంటూ చేసిన వ్యాఖ్యపై వివాదం రేగగా, మీడియా ముఖంగానే క్రిష్ దానికి వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమ సినిమా తో పాటుగా చిరంజీవి సినిమా కూడా బాగా ఆడాలని రెండు మూడు ఇంటర్వ్యూ లలో ప్రస్తావించారు అలాగే ‘సంక్రాంతికి వస్తున్న ఇద్దరు లెజెండ్ ల సినిమాలకి స్వాగతం పలుకుదాం’ అనే ట్వీట్ తో వివాదం సద్దుమణిగేలా చేయగలిగారు. కానీ అదే ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఆగ్రహానికి కారణం అయ్యింది.

ఇప్పటికే ఖైదీ నెం.150 సినిమా పై అసంఖ్యాత ట్వీట్లు చేస్తున్న రాంగోపాల్ వర్మ ‘గౌతమిపుత్ర’ శాతకర్ణి దర్శుకుడు క్రిష్ పై ఆగ్రహం వ్యక్తం చేసారట. సినీ వర్గాల సమాచారం ప్రకారం రాంగోపాల్ వర్మ చిత్ర దర్శకులు క్రిష్ తో ‘మీ సినిమాకి కి మీరు చేస్తున్న ప్రచారం బాగానే ఉంది కానీ వేరే వారి సినిమా గురించి మీకెందుకు’ అని సున్నితంగా మందలించారని సమాచారం. దీంతో రాంగోపాల్ వర్మ కి మెగా ఫ్యామిలీ కి మధ్య ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాలి.

You might also like