snaxngrox.com Free Shipping

సంచలన తీర్పు దిశగా తమిళ ఓటర్లు

ఆర్కే నగర్ ఎన్నికలో తమిళ ఓటర్లు  సంచలన తీర్పు ఇస్తున్నట్లుగా తాజా ట్రెండ్స్ ని బట్టి అర్ధం అవుతుంది

దివంగత ముఖ్యమంత్రి మృతితో ఎన్నిక అనివార్యం అవ్వటం అదీ అమ్మ సొంత నియోజకవర్గం అవ్వటం …ఆమె మరణానంతరం జరిగిన పలు వివాదాలు , పలు నాటకీయ సంఘటనల నడుమ జరిగిన ఈ ఎన్నిక పై ఒక రకంగా దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు ఆసక్తి చూపిస్తున్నారు

ఒక రకంగా ఈ ఎన్నికలో ఎవరినయితే ఓటరు గెలిపిస్తాడో వారిని అమ్మ జయలలితకి నిజమయిన వారసుడిగా తమిళ ఓటరు నిర్ణయించినట్లు పరోక్షంగా అంగీకరించవచ్చు

అయితే ఇక్కడ అనూహ్యంగా డిఎంకె , అన్నా డిఎంకె వర్గాలకు షాక్ ఇచ్చే తీర్పు ఓటర్ ఇచ్చాడా అన్నట్లు ఉన్నవి ట్రెండ్స్ …

తాజా గా అందుతున్న సమాచారం మేరకు  టిటివి దినకరన్ కు  10391 ఓట్లు పోలవగా …

పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మద్దతుతో నిలిచిన అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ కి  4520 ఓట్లు పోలయినవి

డీఎంకే అభ్యర్థి గణేశ్‌ ప్రస్తుతం 2323 ఓట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నారు