snaxngrox.com Free Shipping

మరో సారి చెలరేగిన రోహిత్ …35 బంతుల్లో సెంచరీ

టీం ఇండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో సారి చెలరేగారు …ప్రపంచరికార్డుకి బాట వేసారు …శ్రీలంక తో జరుగుతున్న టి -20 సిరీస్ రెండవ మ్యాచ్ లో రోహిత్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు …నిన్నగాక మొన్న  వన్ డే సిరీస్ లో ఇదే శ్రీలంక పై డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ అంతకు మించిన ఊపుతో కేవలం 35 బంతుల్లో 100 పరుగులు సాధించారు …

ఇంతకముందు ఉన్న టి -20 ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డుని రోహిత్ సమం చేసారు …ఎట్టకేలకు శ్రీలంక బౌలర్లు రోహిత్ ని 118పరుగుల వద్ద అవుట్ చేసారు …కేవలం 43 బంతుల్లో ఈ పరుగులు చేసిన రోహిత్ 12 ఫోర్లు 10 సిక్సర్లు కొట్టారు .

మరో ఓపెనర్ రాహుల్ కూడా అర్ధ సెంచరీ సాధించటంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగిపోతుంది …అందరూ ఊహించినట్లే మాజే కెప్టెన్ ధోని వన్ డౌన్ లో బ్యాట్టింగ్ కి  వచ్చారు

ఇప్పటికి 15 ఓవర్లలో భారత్ ఒక వికెట్ కోల్పోయి 196 పరుగులు సాధించింది …అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిచి ఈ సిరీస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది