రూ.2000 కంటే తక్కువకే స్మార్ట్ ఫోన్.

నోట్ల రద్దు తర్వాత ప్రజలకి మరొక తీపి వార్తను అందించనుంది కేంద్ర ప్రభుత్వం. నోట్ల రద్దు తర్వాత ఆత్మ రక్షణ చర్యల్లో భాగంగా నగదు రహిత లావాదేవిల పై తాయిలాలు ప్రకటించిన విషయం విదితమే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుజర్ లకు గుడ్ న్యూస్ అందించింది.

స్మార్ట్ ఫోన్ ధరలు అన్ని రూ.2000 కంటే కిందకి దిగిరానున్నాయ్. భారతదేశంలో డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువవ్వాలంటే రెండు వేలకే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావాల్సి ఉందని భారత్ పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచన మేరకు ప్రభుత్వం వెంటనే ఆ చర్యలకు సిద్దమైంది. స్మార్ట్ ఫోన్ ధరలు కచ్చితంగా రూ.2,000 కంటే తక్కువగా ఉండేలా వినియోగదారుల ముందుకు తేవాలని దేశీయ హ్యాండ్ సెట్ తయారీదారులను ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో ఆర్థిక లావాదేవీలను మరింత మందికి అందించాలని అభిప్రాయపడుతోంది. మారు మూల ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో డివైజ్ లు లభ్యం కానంత వరకు నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల నీతి ఆయో గ్ నిర్వహించిన భేటీలో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలను తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లను తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది.

అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్, అత్యాధునిక ప్రాసెసర్, మంచి నైపుణ్యతతో తక్కువ ధరలకు ఫోన్లను తీసుకురావడం తమకు సవాళ్లేనని పరిశ్రమలోని వ్యక్తులు చెబుతున్నారు.. పెద్ద నోట్ల రద్దయినప్పటి నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. చూడాలి ఎప్పటికి ఈ రేట్లు డిగి రానున్నాయో.

You might also like