snaxngrox.com Free Shipping

బాలయ్య పై ప్రశంసల వర్షం

 

నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి అనూహ్య స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా బాగుందని నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ హీరోలు, దర్శకులు ట్విట్టర్ ద్వారా తమ అభినందలను, శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు చెప్పిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

సాయి ధరం తేజ్: ఎన్నడూ లేని విధంగా మెగా హీరో సాయి ధరం తేజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు, దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ గారు తమలో చాలామందికి స్ఫూర్తిగా నిలిచారని ఆయన ఫొటో పెట్టి మరీ హర్షం వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలవుతున్న సందర్భంగా బాబాయ్ బాలయ్యకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

నందమూరి కల్యాణ్ రాం: బాబాయ్ కి, దర్శకుడు క్రిష్ కి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ కి ట్విట్టర్ లో ఆల్ ద బెస్ట్ చెప్పారు. నందమూరి కల్యాణ్ రాం కూడా ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

మంచు మనోజ్: యువ హీరో మంచు మనోజ్ కూడా బాలయ్యకు, శాతకర్ణి చిత్రబృందానికి ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

హీరో రాం: ‘‘ఇది కదా సంక్రాంతి అంటే’.. ఈ సంక్రాంతికి రెండు పండుగలు.. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని రామ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నంబర్‌ 150’, చిరు, బాలయ్య అనే య్యాష్‌ట్యాగ్‌లు జత చేశారు.

కృష్ణవంశీ: బాలకృష్ణకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతూ కృష్ణవంశీ తన ఫేస్‌బుక్‌ పేజీలో పెద్ద పోస్ట్ పెట్టాడు. ‘బాలకృష్ణ తెర మీద, తెర వెనుక కూడా అగ్నిపర్వతంలాంటి వాడు. గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూ వెండితెరను ఎంతో కాలంగా వర్ణరంజితం చేస్తున్నాడు. 2000 ఏళ్ల తర్వాత తెలుగు ప్రజల్ని అలరించడానికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మళ్లీ వస్తున్నాడు. ఉన్నత ప్రమాణాలతో సినిమా రూపొందించిన క్రిష్‌కు అభినందనలు. ఈ సినిమా ఘనవిజయం సాధించి సినీ పరిశ్రమ మొత్తానికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాన’ని పోస్ట్‌ చేశాడు.

కోన వెంకట్‌: ఇక, ప్రముఖ రచయిత కోన వెంకట్‌ కూడా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గురించి స్పందించాడు. ‘ఇప్పుడు టైమ్‌ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ది. తెలుగు సినిమా పండుగ కంటిన్యూ అవుతోంది. దర్శకుడు క్రిష్‌కు, బాలయ్యబాబుకు ధన్యవాదాల’ని పోస్ట్‌ చేశాడు.

రాజమౌళి : ట్విట్టర్ లో రాజమౌళి చిత్ర యూనిట్‌పై ప్రసంశల జల్లు కురిపించారు. ‘శాతకర్ణి’ అద్భుత కావ్యంలా ఉందని, ఈ సినిమాను 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని రాజమౌళి అన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత దర్శకుడు క్రిష్‌ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా ‘శాతకర్ణి’ చిత్రాన్ని క్రిష్‌ తెరకెక్కించారని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. తెలుగు చిత్రాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అజరామరం అని రాజమౌళి పేర్కొన్నారు.

రాం గోపాల్ వర్మ: గౌతమీపుత్ర శాతకర్ణి పై రాం గోపాల్ వర్మ స్పందిస్తూ “క్రిష్ చాలా ఉద్వేగంగా ఉంది నా జడ్జ్మెంట్ తప్పవలేదు, మీకు బాలయ్యకు 100 చీర్స్ అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

ఏది ఏమైనా గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు సినీ చరిత్ర రికార్డులను తిరగ రాసేట్టే కనపడుతోంది.

 

 

 

You might also like